Breaking News

వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయండి : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి*   ▪️వివిధ విభాగాల తో వరద నష్టం పై సమీక్ష సమావేశం…..*GWMC,

116 Views

*వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయండి : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి*

▪️వివిధ విభాగాల తో వరద నష్టం పై సమీక్ష సమావేశం…..

*GWMC,

బల్దియా పరిధి లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.

సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో బల్దియా కు చెందిన ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్,రెవెన్యూ,శానిటేషన్,డి.ఆర్.ఎఫ్. విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే క్రమం లో సిబ్బంది క్షేత్ర స్థాయి లో ఉండి నిరుపమానమైన సేవలు అందించారని అభినందించారు.

 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం లో అనేక ప్రాంతాలు ముంపునకు గురికావడం జరిగిందని,అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ లు దెబ్బతిన్నాయని జరిగిన నష్టానికి సంబంధించి ఏ.ఈ.ల వారిగా సంబందిత కార్పొరేటర్ ల సహకారం తో అంచనాలు తయారు చేస్తే ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని,శిథిలావస్థలో ఉన్న భవనాలు,అత్యంత ప్రమాదకరం గా ఉన్న నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది గుర్తించాలని, బల్దియా కు చెందిన బిల్ కలెక్టర్ లు, రెవిన్యూ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లో సంయుక్తం గా సర్వే నిర్వహించి ఏరియా,డివిజన్ ల వారి గా దెబ్బతిన్న ఇళ్ల సమగ్ర సమాచారాన్ని అందజేయాలని,వరద ముంపు నకు గురైన ఏరియా ల్లో వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్)లు కొనసాగించేలా వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ తో మాట్లాడి కొనసాగించేలా చూడాలని,జే.సి.బి.లను సమయానుకూలంగా ఆయా డివిజన్ లకు పంపిస్తూ స్థానిక కార్పొరేటర్ లతో సమన్వయం చేస్తూ ప్రణాళిక లు సిద్దం చేయాలని,2020 సం. లో వరదలు సంభవించిన నేపధ్యం లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు చేపట్టాల్సిన అభివృద్ది పనులు కొనసాగుతున్ననందున అట్టి పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయో అట్టి పనుల పురోగతిని మేయర్ అడిగి తెలుసుకున్నారు.ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటించే క్రమం లో స్థానిక కార్పొరేటర్ లకు సమాచారం అందజేసి వారిని భాగస్వాములను చేయడం వల్ల ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని, వివిధ డివిజన్ లలో దెబ్బతిన్న డ్రైన్ ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని,బల్దియా పరిధి లోని వివిధ నియోజక వర్గాల వారీగా కొనసాగుతున్న అభివృద్ది పనుల సంబంధిత సమాచారాన్ని అందజేయాలని,విపత్తులను సమర్థవంతంగా గా ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న డి.ఆర్.ఎఫ్.బృందానికి సమాంతరంగా 27 మంది తో మరో విపత్తు ప్రతిస్పందన దళం (డి.ఆర్.ఎఫ్)ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భం గా మేయర్ అధికారులను ఆదేశించారు.

 

ఇట్టి కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, ఆర్.ఎఫ్.ఓ పాపయ్య, ఎస్.ఈ లు ప్రవీణ్ చంద్ర, కృష్ణ రావు, సి.హెచ్.ఓ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వెంకన్న, డి.ఎఫ్.ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, పన్నుల అధికారి జోనా, డి.సి.పి ప్రకాష్ రెడ్డి ఎం.హెచ్.ఓ. జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *