వర్గల్ మండల్, మల్లారెడ్డి పల్లి,మార్చ్ 9,24/7 తెలుగు న్యూస్ :ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి సొంత నిధులతో గ్రామానికి ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం,కొండ పోచమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని,ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగిందని మల్లారెడ్డి పల్లి గ్రామస్థులకు ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డిని అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్,రామకృష్ణారెడ్డి,ముత్యాలు,నాగరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




