ముస్తాబాద్ ప్రతినిధి జూలై 29, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేటికీ 24. రోజులు గడుస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాపై మొండి వైఖరి చూపిస్తుందని ముస్తాబాద్ గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదన్నారు. నేటికి 24. రోజులు గడుస్తున్న పట్టించుకోకపోవడం ఇంత దారుణమా
ని మండిపడ్డారు. నేడు రాష్ట్రజాతీయస్థాయిలో మేముచేసే పారిశుద్ధ్యం వలన అవార్డులు తీసుకుంటుంది అంటే ఆఘనత గ్రామపంచాయతీ కార్మికులకే దక్కుతుందన్నారు. మాకు గొంతెమ్మ కోరికలు మాకొద్దు కేవలం మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతోపాటు కనీస వేతనం రూ.19500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం మాకున్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులు తెలిపారు.




