ప్రాంతీయం

మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు డ్రగ్ అవేర్నెస్

97 Views

విద్యార్దుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషించాలి.

సీనియర్లు జూనియర్ విద్యార్థులకు గైడ్ లాగా, పెద్ద మనిషి లగా, సోదరులుగా మార్గదర్శకంగా ఉండాలి.

ర్యాగింగ్ రహిత క్యాంపస్‌గా మార్చడానికి విద్యార్ధులు కృషి చేయాలి: సీపీ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్.

గోదావరిఖని లోని మెడికల్ కాలేజీ లో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసులు ఐపిఎస్., (డిఐజి ) విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పై యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి అవగాహన సదస్సుకు హాజరైన సుమారు 400 మంది విద్యార్థుల చేత యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు.

విద్యార్థులను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ, బాధ్యతలు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనను కలిపివేసిందని, వెంటనే మెడికల్ కళాశాల విద్యార్థులకు కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం కాకుండా, భవిష్యత్తులో ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించరించాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్దుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలలు విద్యార్ధుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవాలని సీపీ సూచించారు.

రామగుండం పోలీసులు, అన్ని విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహిస్తామన్నారు. ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడడం విద్యార్థుల భవిష్యత్తును పాడుచేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తమ జూనియర్‌లను సోదరులుగా, గైడ్ లాగా, పెద్ద మనిషి లగా, ఉంటూ వారికి అండగా ఉండాలని, వారికి సహకరించాలని విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని సీపీ పేర్కొన్నారు.

విధ్యార్థులు ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తు నిర్మాణం కోసం కళాశాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కళాశాలలో ప్రత్యేక పోలీస్ టీం లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని కళాశాలలో షీ టీమ్ బృందాలు మఫ్టిల్లో తిరుగుతూ, బాడీ కెమెరాలతో రికార్డ్ చేస్తూ నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఇలాంటి ఆకతాయి పనులు గాని ర్యాగింగ్, ఈవ్ టిసింగ్ వంటి చేసినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డేగ కళ్ళతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు.

సీపీ, పోలీస్ అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ అనేది నేరం అనే వార్నింగ్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్