ప్రాంతీయం

అత్యవసరమైతేనే బయటికి రావాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

72 Views

 

*భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

 

24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ అందుబాటులో.*విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ గారు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనను విడుదల చేశారు.రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రంగాన్ని అప్రమత్తం చేయాడం జరిగిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదని ఎస్పీ గారు తెలిపారు.*పోలీసు యంత్రాంగం,DRF బృందం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని,అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.*జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని,నర్మల ఎగువ మానేరు మత్తడి దుంకుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఎగువ మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని అన్నారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.జలాశయాలు, చెరువులు,వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు మత్స్యకారులు,ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదు.రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు.చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *