తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ఈరోజు 22 రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈరోజు కార్మికులంతా వర్షంలో సైతం లెక్కచేయకుండా రైన్ కోట్లు వేసుకొని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అందజేయడం జరిగింది. రానున్న రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ధర్నా ఉంటుందని రాష్ట్ర కమిటీ సభ్యురాలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్స్ను నెరవేర్చాలని లేని పక్షాన గ్రామాల్లోని ప్రజలు రోగాలా బారిన పడుతున్నారని, గౌరవాధ్యక్షుడు కోల చంద్రం మండల అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యురాలు లింగంపల్లి కృష్ణవేణి మండల ఉపాధ్యక్షుడు రవీందర్ ఆత్మకూరు తిరుపతి కార్మికులు పాల్గొన్నారు.
