ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేసిన యాదవ జిల్లా అధ్యక్షుడు మీరాల భాస్కర్ యాదవ్

154 Views

ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటిన యాదవ సంఘం నేతలు…

ఇల్లు కూలి నిరశ్రయులైన బాధిత కుటుంబానికి అండ..

తగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పాపర వేణి లక్ష్మి ఇల్లు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో యాదవ సంఘం నేతలు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటారు.ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.ఈ మేరకు భారీ వర్షాలకు ఇల్లు కూలి వీధినపడ్డ పాపరవేని లక్ష్మీ కుటుంబానికి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఆదివారం జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్,మండల యాదవ సంఘం అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ల సమక్షంలో  బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి మిరాల  భాస్కర్ యాదవ్ 5000 రూపాయలు,మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో 30000 రూపాయలు,గ్రామ సర్పంచ్ శివ జ్యోతి 50 కిలోల బియ్యం,ఎంపీటీసీ బుస్స స్వప్న లింగం లు 3000 రూపాయలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్,మండల యాదవ సంఘం అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్  నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *