ప్రాంతీయం

గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్….

108 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్. డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నరాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గజ్వేల్ న్యూరో స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషకరమని,గజ్వేల్ పరిసర ప్రాంతాల వారు నరాలకు సంబంధించి వైద్య సేవల కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లే వారని ఇప్పుడు గజ్వేల్ లో మొట్టమొదటిసారిగా నరాలకు సంబంధించి ఆసుపత్రిని ప్రారంభించినందుకు డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మరియు వారి వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని నరాలకు సంబంధించిన వారి వైద్య సేవలను అందించాలని డాక్టర్లను కోరారు.ఈ సందర్భంగా డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గంలో ఈ గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషకరమని,ఈ గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రత్యేకతలు మెదడు,పక్షవాతం, వెన్నుముక,ఫిట్స్,నరాలకు సంబంధించి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఎల్లవేళలా 24 గంటలు వైద్య సేవలు అందజేస్తానని పేర్కొన్నారు.ఈ నరాలకు సంబంధించి స్పెషల్ న్యూరో లాబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజారాం,భాను,శ్రీకాంత్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *