సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి వందమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళలు సోమవారం గ్రామ సర్పంచ్ నరేష్ గుప్త,కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రతి పక్షాల నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి వస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని, పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు పెరుగుతాయని పేర్కొన్నారు.
శభాష్ సర్పంచ్…
చాట్లపల్లి సర్పంచ్ నరేష్ గుప్త గ్రామ అభివృద్ధిలో చక్కగా పనిచేస్తున్నారని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని,అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సైనికులా పని చేస్తుండని మంత్రి హరీష్ రావు సర్పంచ్ నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.సర్పంచ్ నరేష్ కు రానున్న రోజులలో మంచి భవిష్యత్ ఉందని మంత్రి ప్రశంసించారు.కార్యక్రమంలో ఎంపిటిసి కావ్యదర్గయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఏక్భాల్,ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్త, ఉప సర్పంచ్ అజాం, నాయకులు దేశిరెడ్డి, ఖదీర్, ఆంజి, అశోక్, తిరుపతి, అనిల్, నరేష్, కనకయ్య, శ్రీను, నర్సయ్య, రమేష్, సుమన్, కృష్ణ, వెంకటేష్, బాలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.