కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్.
ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళా మృతి.
-కాగజ్ నగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట మహిళ మృతదేహంతో ధర్నా.
-బాధిత కుటుంబానికి బిజెపి నాయకుల మద్దతు.
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళ మృతి చెందిందని కొమురం భీం జిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే. లక్ష్మి శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల్లో భాగంగా పత్తి పేరేందుకు గ్రామ సమీపంలోని పంట చేనులోకి వెళ్లి పత్తి ఏరుతుండగా అదే ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేయడంతో మెడ భాగం పై తీవ్రంగా గాయం అవ్వడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే పులి దాడిలో మహిళ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ కుటుంబానికి కారకులైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పులి జాడ ట్రాక్ కోసం అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ గ్రామాల్లో పులి సంచారం పై అవగాహన కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంతోనే పులి మహిళపై దాడి చేసిందన్నారు. గతంలో పంట చేనును కాపాడడం కోసం రైతులు తీగ అమర్చడంతో అడవి పంది మృతి చెందగా రైతులపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. పులి ఎక్కడికి వెళుతుందో అనే విషయం ఫారెస్ట్ అధికారులకు జిపిఎస్ వాయిస్ ద్వారా సమాచారం ఉంటుందన్నారు. అలాంటప్పుడు అటవీ అధికారులు ముందస్తు చర్యలు చేపడితే పులి దాడిలో ప్రాణం బలై పోకుండా ఉండేదన్నారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులదే అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పులి దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబానికి పట్టణంలోని పలువురు మద్దతుగా నిలిచారు.





