
గ్రామాల్లోని నిరుపేదలకు ప్రజాహిత ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఇందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గం లో గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటారని ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో బండ్ల బుధవ్వ, అయ్యగార్ల లక్ష్మీనరసయ్య ,సయ్యద్ నగర్ గ్రామాల్లో మసీదు వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పాలిన్ కవర్లను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బండ్ల స్వామి, అయ్యగారి రవి, రమేష్, శ్రీశైలం, కనకరాజు, సంతోష్, మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




