ముస్తాబాద్, ప్రతినిధి జూలై 23, చీకోడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రేకులకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు మరియు చీకోడు ఎస్సీ కాలనీ నుండి వడ్డెర కాలనీ మీదుగా చిప్పలపల్లి వరకు ఈరెండు బీటీ రోడ్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కు చీకోడు గ్రామ ప్రజల తరఫున పాలకవర్గం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించారు. ఇందుకు సహకరించిన చీకోడు పాలకవర్గ సభ్యులకు వార్డ్ మెంబర్ ఊరడి రాజు ధన్యవాదాలు తెలిపాడు. కార్యక్రమంలో చికోడు సర్పంచ్ చర్లపెళ్లి రజిత-సుధాకర్ రెడ్డి, రాజ్ కిరణ్ రెడ్డి, కొప్పు రమేష్ తదితరులు పాల్గొన్నారు.




