మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు డిబిఎఫ్ ధర్నా.
నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు.
తుర్క బంజెరు పల్లి వడ్డెరుల ప్లాట్ లకు పొజిషిన్ చూపించాలి.
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
సిద్దిపేట జిల్లా జనవరి 20,
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరొసా పధకాన్ని వర్తింప చేయాలని ,నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు.. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఉపాధి హమి పధకం, అర్ అండ్ ప్యాకెజిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చెస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో సోమవారంనాడు సిద్దిపేట జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎఓ కు వినతిపత్రం సమర్పించి చర్చించారు.. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ,
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు గత నాలుగు సంవత్సరాలు గా ఉపాధి హమి పనులు కల్పించకుండా ఉపాధి హమి చట్టాన్ని ఉల్లంఘించారన్నారు.ఉపాధి హమి పనులు కల్పించక పొవడం వల్ల ప్రస్తుతం ప్రభుత్వం కూలీలకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధాకానికి అర్హులు కాకుండా పొయారన్నారు.ఇటివల మున్సిపాలిటీ లలో కలిపిన గ్రామాలకు ప్రత్యేక పరిస్థితులలో అమలు చెస్తున్నట్లే మల్లన్న సాగర్,రంగనాయక్ సాగర్,కొండపొచమ్మ సాగర్ తదితర ప్రాజెక్డుల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకాన్ని అమలు చేయాలన్నారు.ప్రభుత్వమే భూమిని స్వాధీనం చెసుకున్నందున నిర్వాసితులు భూమి లేని కూలీలుగా మారారన్నారు. భూ సేకరణ చట్టం 2013 చట్టం ప్రకారం అర్ అండ్ అర్ ప్యాకెజిని వేముల ఘాట్ పరిధిలో ని తుర్క బంజెరెపల్లి కి చెందిన 44 మంది వడ్డెర కులస్తులకు ప్లాట్ లను రిజిస్ట్రెషన్ చెసి మూడు సంవత్సరాలు దాటిన నేటికి పొజిషన్ చూపించలేదన్నారు. 16 వందల మంది మల్లన్న సాగర్ నిర్వాసితులకు ప్లాట్ లను చూపించలేదన్నారు.దాదాపు600 మందికి అర్ అండ్ ప్యాకేజీ అమలు చెయలేదన్నారు.దాదాపు 800 మంది ఒంటరి మహిళలకు అర్ అండ్ అర్ ప్యాకెజి అమలు చేయకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. 400 ఎకరాలకు నష్టపరిహరం నేటికి అందించలేదన్నారు.. ఒంటరి మహిళలకు, 18 సంవత్సరాలు నిండిన కొంత మంది వయోజనులకు సైతం అర్ అండ్ అర్ ప్యాకెజిని అమలుచేయలేదన్నారు.
జాబ్ కార్డు లు మా వద్ద మా పనులు ఎక్కడ…పనులు కల్పించాలని,ఇందిరమ్మ అమృత భరోసా పధకం కింద నిర్వాసితులకు 12 వేల ఆర్ధిక సహాయం అందించాలని,అర్ అండ్ ప్యాకేజి అమలు చేయాలని నినాదాలు చేశారు.
ఈ ధర్నా లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు ,హైకొర్టు న్యాయవాది దివాకర్ నిర్వాసితులు నర్సింలు,కనకయ్య,రుక్కయ్య,నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.





