ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి
కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందించారు.
