*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సత్వర న్యాయం జరుగుతుందనీ భరోసా కలిగించాలి*
*చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినముగా వ్యవహారించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,*
ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల పోలీసులు కఠినముగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మందమర్రి సీఐ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మంచిర్యాల డీసీపీతో కలిసి తనిఖీ చేశారు. మందమర్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కి పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో అప్లోడ్ చేసి రిసిప్ట్ ఇవ్వాలని వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లోని లాక్ అప్ రూమ్, రైటర్ రూమ్, రికార్డ్స్ రూమ్ పరిశీలించారు. అనంతరం సర్కిల్, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగి కేసులు, నిందితుల అరెస్ట్, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీంచారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రత నియంత్రణ కై పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత మనందరి బాధ్యతని, ప్రధానంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా పెట్టాలని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ప్రజలు సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలి అని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏలాంటి సమస్య, సందేహాలు, సలహాలు, సూచనలు అడిగే లాగా ప్రజలకు వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీసులు విధులు నిర్వర్తించాలి అన్నారు.
ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మందమర్రి సీఐ శశి ధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
