రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ని ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు
జిల్లా ఎస్పీ రాహుల్ ల్ హెగ్డే ప్రత్యేక చొరవతో లీట్స్ ఫేస్ కంపెని సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌకర్యర్ధం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బూత్ ని సోమవారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ గారితో మరియు పోలీస్ అధికారులతో కలసి ప్రారంభించి రిబ్బన్ కట్ చేశారు
అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ….
ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌకర్యర్ధం పట్టణంలో ఎనమిది ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కంట్రోల్ బూత్ లను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు…బస్టాండ్ ప్రాంతంలో పోలీస్ రేలేటెడ్ సమస్యలు ఉన్నా ఇతర సమస్యలు ఉన్నా ప్రజాలు,ప్రయాణికులు బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ని సంప్రదించవచ్చు అని అన్నారు..జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిరహిస్తున్నాం అని అన్నారు. వాహనాలుదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్,సీటు బెల్టు ధరించాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు.వాహనదారులు తమ యొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను సకాలంలో చెల్లించాలని కోరారు.మూడు కంటే ఎక్కవగా ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ లో ఉన్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని సదరు వాహనదారులు సకాలంలో తమ యొక్క పెండింగ్ ఈ-చాలాన్స్ ను చెల్లించ లేనిపక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ వారికి సహకరించాలి అని అన్నారు..
ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ గారు, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, లీట్స్ ఫేస్ కంపెని ఏం డి నాగేశ్వరరావు ఎస్.ఐ లు పరుశురాం, రాజు. స్థానిక కౌన్సిలర్ పాల్గొన్నారు…
