హైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఈ నెల 21న ‘చలో దిల్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారమిక్కడ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ‘చలో దిల్లీ’ గోడపత్రికను విడుదల చేశారు.
రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించాలన్నారు. అందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 24న ‘చలో దిల్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
