ప్రాంతీయం

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల తీరు హాస్యాస్పదం భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…

157 Views
   ముస్తాబాద్, ప్రతినిధి జూలై 15, రాష్ట్రంలో అధికారంలో ఉండి నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు తెలుపుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని త్వరగా కొనుగోలు  చేయాలని, ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని, ధర్నాలు రాస్తారోకో చేసినప్పుడు పట్టించుకొని అధికార పార్టీ నాయకులు, పండించిన ధాన్యం అమ్మిన డబ్బులు అకౌంట్లో పడక రైతులు ఇబ్బందులకు గురైనప్పుడు, పట్టించుకోని అధికార పార్టీ నాయకులు, ఇప్పుడు అనవసర విషయాలపై రాజకీయాలు చేయడం మరియు పోటాపోటీ ధర్నాలు రాస్తారోక లు చేయడం హాస్యాస్పదంగా ఉందని, రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు రైతుల అంశాన్ని పక్కనపెట్టి అనవసర విషయాలపై రాజకీయం చేస్తూ సమస్యలపై ప్రజల దృష్టి మరలస్తున్నారని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అధికార పార్టీ దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *