సికింద్రాబాద్ కోర్టులో ఏడవ రోజు పూర్తి చేసుకున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం.
న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ప్రారంభించిన పోస్ట్ కార్డ్ ఉద్యమం నేటికి ఏడవ రోజు పూర్తి చేసుకొని ముందుకు సాగుతుంది. సికింద్రాబాద్ కోర్టులోని బార్ అసోసియేషన్ లో శుక్రవారం నాడు కొనసాగిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. చంద్రశేఖర్ , జనరల్ సెక్రెటరీ ఎ. రాజు , కార్యవర్గ సభ్యులు మరియు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని పోస్ట్ కార్డ్ లను దేశ ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతూ పోస్ట్ కార్డ్ ల ద్వారా విజ్ఞప్తులు పంపడం జరగింది. నేటి ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన పోస్ట్ కార్డ్ ఉద్యమ కారులు మరియు న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్ . ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బార్ అసోసియేషన్ నుండి పూర్తిస్థాయిలో మద్దతు లభించాలని విజ్ఞప్తి చేశారు.