జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు మరియు వాహన పూజలు
విజయ దశమి అందరికి విజయాలు చేకూర్చాలి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
23 అక్టోబర్
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు., విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.
పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో ప్రభాకర రావు, భీమ్ రావ్ , డిఎస్పీ లు వెంకట స్వామీ, రవీంద్ర కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు జానీ మియా, రామకృష్ణ, వేణు, టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు, ఆర్ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
