హైదరాబాద్: భారాసలోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మంత్రి హరీశ్ రావుతో భేటీ నేపథ్యంలో భారాసలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
‘‘ధూల్‌పేట ఆసుపత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌రావును కలిశా. ఆయన పిలిస్తేనే వారి ఇంటికి వెళ్లి ఆస్పత్రి సమస్యలు వివరించా. ధూల్‌పేట ప్రభుత్వాసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా చేయాలని మంత్రిని కోరా. నేను భాజపాను వదిలి నేను ఏ పార్టీలోకి వెళ్లను. తనపై విధించిన సస్పెన్షన్‌ను భాజపా ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు.




