ప్రాంతీయం

రాంసాగర్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.

10 Views

రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని అన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఐకమత్యం, సాంస్కృతిక చైతన్యం, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, నరేందర్ రెడ్డి, యాదయ్య, నవీన్ కుమార్, మహేష్, శ్యామ్ సుందర్ శర్మ, మంజుల, హనీఫ్, ఉమ, సీఆర్‌పీ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *