ప్రాంతీయం

సర్దార్ సర్వాయి పాపన్న అవార్డు అందుకున్న కొండా శ్రీనివాస్ గౌడ్ కు ఘనంగా శాల్వాతో సత్కారం…

271 Views
    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 9, మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలోని అన్నిగౌడ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కొండ శ్రీనివాస్ గౌడ్  కరోనటైంలో చేసినటువంటి సేవలు కరోనా సోకిన ఎంతోమంది బాధితులను కరోనాను లెక్కచేయకుండా చికెన్ గుడ్లు ఆహారం అందించిన ఘనత ఆయనకు దక్కిందని ఈవిషయాన్ని గమనించిన ఆయనకు డిల్లీలో జాతీయ సర్దార్ పాపన్న అవార్డు అందించి శాల్వాతో సన్మానించారు. ఈఘనత తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండా శ్రీనివాస్ గౌడ్ కు ఆగౌరవం దక్కిందని సంఘం నాయకులు అభినందించి గౌడసంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా సగౌరవంగా శాల్వాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు మోతే బాలరాజు, మాజీ జెడ్పిటిసి మేరుగు యాదగిరిగౌడ్, మేరుగు రాజేశంగౌడ్, సీనియర్ నాయకుడు అంజగౌడ్, పట్టణ అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లెల్ల ఉపేంద్రగౌడ్, కోలా కృష్ణగౌడ్, సత్యంగౌడ్, మండలంలోని అన్ని గౌడసంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *