ప్రాంతీయం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

80 Views

పన్నెండవ వార్డులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 2

సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డులో గల వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే నినాదంతో గట్టి పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ ది అన్నారు.

కెసిఆర్ చేసిన సేవలు మరవలేవని గత పది సంవత్సరాల రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గడప కందాయని, భారతదేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ పథకాల అమలు చేసిందని వారన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ జమీల్, వార్డ్ కమిటీ సభ్యులు పాషా, నాగరాజు, బిక్షపతి, సంతోష్, స్వామి, ప్రవీణ్, నదీం, ప్రశాంత్, భశీర్, మోహిన్నిధిన్, అక్బర్, తిరుపతి, నర్సన్న, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్