ప్రాంతీయం

బిసి ప్లీనరీని విజయవంతం చేయాలి…

154 Views
   ముస్తాబాద్, ప్రతినిధి జూలై 9, బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలానికి చెందిన బీసీ విద్యార్థి  సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఈనెల15 నాడు బీసీ ప్లీనరిని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ కోరారు. పదివేల మంది బిసి ప్రతినిధులు నిర్వహించే బిసి రాజకీయ ప్లీనరీని తెలంగాణలో రాజకీయాలను శాసించబోతున్నామని అన్నారు. ఈసమావేశంలో బీసీల రాజకీయ భవిష్యత్తు దశా చర్చించడం జరుగుతుందని బీసీ మేధావులందరూ హాజరవుతారని అన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ అగ్రకులాల వారే పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారని ఇంతకాలం బిజెపిలో రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నేత బండి సంజయ్ ని సైతం తప్పించి మళ్లీ అగ్రకులాలకు అప్పజెప్పడం దురదృష్టమని అన్నారు. అన్ని రాజకీయ విద్యా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈసమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు మట్ట నరేష్ మరియు బీసీ విద్యార్థి నాయకులు నవీన్,జగన్, అల్లే నిరాజ్, ఎల్లె చింటూ, కోడి రోహిత్, సాయి, ఎండి సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *