భద్రాచల దేవస్థాన సీతారాముల కల్యాణానికి మనము వెళ్లలేకున్న భక్తితో మనము ఓలిచి తలంబ్రాలు ఆ రామయ్య పాదాల వద్దకు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులందరూ గత 2నెలల నుండి వాడ వాడల భక్తి శ్రద్ధలతో రామ నామాన్ని స్మరిస్తూ తలంబ్రాలుగా చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు అందజేశారు. కోటి తలంబ్రాల దీక్షలో చివరి రోజు శుక్రవారంనాడు సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పుల ప్రసాద్ ఓడ్లను ఓలిచి రామకోటి రామరాజు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి భక్తుణ్ణి బాగా స్వాములను చేయడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనమన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు మడత రమేష్ సారు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని ఓడ్లను రామ రామ అంటూ భక్తితో ఓలిచి రామకోటి రామరాజుకు అందజేశారు తమ భక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి అద్భుత అవకాశం కల్పించినందుకు రామకోటి రామరాజుకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నరేష్ బాబు దంపతులు ఇద్దరు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని రామ నామాన్ని స్మరిస్తూ భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజు అందజేశారు. ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం భక్తులకు అందజేయాలని రామకోటి రామరాజును కోరారు. ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కూడా పూర్తి చేసి అందజేశారు.
“నేటితో కోటి తలంబ్రాలు దీక్ష పూర్తి”




