ప్రాంతీయం

మంచిర్యాల ఐబి స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన

78 Views

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నాజన్మ చరిత్రాత్మమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

గురువారం ఐబీ స్థలంలో మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, అనాలోచితంగా మాతా, శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంచిర్యాల జిల్లాతో పాటు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఏడు అంతస్తుల్లో ఆధునీక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు అంతస్తులో తక్కువ పేమెంట్ తో ఉన్నత వైద్యం అందిస్తారని తెలిపారు. రెండున్నర ఏండ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు తొలి విడతగా కేటాయించినట్లు వివరించారు. మిగతా నిధులు దశల వారిగా విడుదల అవుతాయని ఆసుపత్రి నిర్మాణం నిరాటకంగా నిర్ధేశిత గడువులోపు జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాల్లవాగు నుంచి లోతట్టు ప్రాంతాలకు వరద బెడద లేకుండా కరకట్ట నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ నిర్మించనున్నామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.

ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ ఛైర్మన్ లు ఉప్పలయ్య, సూరిమిల్ల వేణు నియోజకవర్గంలోని నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్