తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సందర్శించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వం అధికారుల చేత గ్రామపంచాయతీలలో పోటీ కార్మికులను పెట్టి కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నిస్తూ కార్మికులకు బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై జేఏసీ నాయకులకు చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించి కార్మికుల సమ్మెను విరమింపజేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ప్రతిఘటన పోరాటాలకు కూడా గ్రామపంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారుఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ , కార్యదర్శి లింగంపల్లి కృష్ణవేణి , కోల చంద్రయ్య , కంసాని రవీందర్ , తిరుపతి , భూమయ్య , రాజు , దుర్గయ్య , అనిల్ , ప్రసాద్ , స్వామి మండలంలోని అన్ని గ్రామాల నుండి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
