ప్రాంతీయం

కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ 

12 Views

కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 

కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కొమురవెల్లి జాతర నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలని తెలిపారు.అటెండెన్స్ ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓపి రిజిస్టర్ రాయడంలో పలు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసి సిబ్బంది, మెడిసిన్, పరీక్షలకు సంబంధించి ఎలాంటి సదుపాయాలకైన డిఎం అండ్ ఎచ్ ఓ దృష్టికి తీసుకురావాలని పిఎచ్ సి కి వచ్చే రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఫార్మసీ స్టోర్ కి వెళ్ళి మందులు తనికి చేశారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని అన్ని మందులు ఎక్కువ మొత్తంలో ఉండాలని తెలిపారు. పి ఎచ్ సి లో శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తకాల్లో చదివిన జ్ఞానాన్ని నేరుగా చూస్తూ మంచి శిక్షణ పొందాలని ప్రజలకు మంచి వైద్యం అందించాలని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *