మైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు
సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి,సుమన్ కుమార్
సిద్దిపేట, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేయడమైనది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడమైనది. (సోమవారం) ఉదయం 10 గంటల నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి. ఇకపై మైనర్ డ్రైవింగ్ (మైనర్ డ్రైవింగ్) మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని (వితౌట్ డి ఎల్) కేసుల్లో టీ ఎస్ -ఈ – టికెట్ ఆప్ ద్వారా కేవలం ‘ జీరో ఫైన్ ‘ టికెట్ మాత్రమే జారీ చేయబడుతుంది. అంటే, ఆన్‌లైన్‌లో జరిమానా కట్టే అవకాశం ఉండదు, ఈ- చలాన్‌ను నేరుగా కోర్టుకే పంపించడం జరుగుతుంది.నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ( సెక్షన్ 201) ప్రకారం సదరు వాహనాన్ని పోలీసులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తరహాలోనే, ఈ కేసుల్లో కూడా నిందితులపై పెట్టీ కేసు (పెట్టీ కేసు) చార్జ్ షీట్ దాఖలు చేస్తారు. స్వాధీనం చేసుకున్న వాహనం మరియు ఈ-చలాన్ కాపీలతో సహా నిందితులను తప్పనిసరిగా కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది.మైనర్లకు వాహనం ఇచ్చే తల్లిదండ్రులు లేదా యజమానులపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో వాహన యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, వాళ్లని కూడా రెండవ నిందితుడిగా (ఏ 2) చేర్చి కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుందని తెలియజేదమైనది.ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాపాయం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.





