ప్రాంతీయం

ర్యాంక్ తో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్ధులకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చెయ్యాలి…

135 Views

 ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో బిసి భవన్ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బిసి విద్యార్థిని విద్యార్థులకు ర్యాంక్ తో సంబందం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నీ ప్రభుత్వం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్య కి 10,000 ర్యాంక్ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద బిసి విద్యార్థులు ఉన్నత (ఇంజనీరింగ్) విద్యకు దూరం చేసేందుకే ఈ నిబంధనని ఏద్దేవ చేశారు. లేని పక్షంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్  నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల చేస్తాంమని ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, నాయకులు నవీన్ కుమార్, మట్టే నరేష్ తదితరులు పాల్గోన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *