శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం – సర్పంచ్ మంజుల శ్రీరాములు
మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామ శివారులో వెలసిన పురాతన ఆలయం శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆలయ అర్చకులు మధు మోహన్ లు అన్నారు. ఈ సందర్బంగా ఉగాది పండుగ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు మొట్టమొదటి అన్నదాత చేబర్తి గ్రామానికి చెందిన చాట్లపల్లి దాసు ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా సర్పంచ్ మరియు అర్చకులు మాట్లాడుతూ అన్నదానం మహాధానము మనకు కలిగిన దాంట్లో పావలా భగవంతుని కృపకు వినియోగిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని దాత దాసు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్ బహుజన నాయకులు చిన్ని కృష్ణ భక్తులు ఉన్నారు
