*రామగుండం పోలీస్ కమిషనరేట్*
బ్రాంజ్ మెడల్ సాధించిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతకు పోలీస్ కమిషనర్ ఘన సత్కారం
3వ ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో యోగా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు గౌరవం తీసుకువచ్చిన పెద్దపల్లి జోన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఘనంగా సత్కరించారు.
ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో మే 23, 2026న నిర్వహించిన 3వ ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 35 నుంచి 45 సంవత్సరాల వయో విభాగంలో జరిగిన యోగా పోటీల్లో శ్రీలత ప్రతిభ కనబర్చి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆమెకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి శాఖకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





