Breaking News

బీఆర్ఎస్ నాయకులకే మైనార్టీ బందా

299 Views

యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
మహ్మద్ ఆశిక్ పాషా

మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులైన వారికి వారి అనుచరులకు మైనారిటీ బందు లోన్ లు వస్తున్నాయి. ఇది మైనారిటీ బందు కాదు, బీఆర్ఎస్ పార్టి కి చెంచాగిరి చేసే వాళ్ల బంధు అని మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆశిక్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ బందుగా మైనార్టీ బందు మారిందని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కోటి ఆశలతో వందల రూపాయలు ఖర్చు పెట్టి లోన్ల కోసం పేద ముస్లింలు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఇస్తుందనుకున్నా మైనారిటీ లక్ష రూపాయల సబ్సిడీ లోన్ కాస్త బిఆర్ఎస్ పార్టీ నాయకులకు వరంగా మారింది.

తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడికి, అతని అనుచరులకు మైనార్టీ బంద్ ఇవ్వడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.. మండలంలో వీరు తప్ప నిరుపేద ముస్లింలు లేరా అని అధికారుల పై మండిపడ్డారు.. రాజకీయంగా పలుకుబడి వున్నా వాళ్లకే ఇస్తున్నప్పుడు ఇతర పేద ముస్లింల నుండి దరఖాస్తులు ఎందుకు స్వీకరించారో అధికారులు చెప్పాలన్నారు. దరఖాస్తు చేసుకున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఈ లోన్లు వస్తాయని, వేరే పార్టీ వాళ్లకు రావు అని చెప్పిఉంటే వందలాది రూపాయలు ఖర్చుపెట్టి లోన్ల కోసం దరఖాస్తులు చేసేవాళ్లు కాదు కదా. అధికార పార్టీకి చెందిన వారికే బీసీ లోన్లు కానీ మైనార్టీ లోన్లు కాని కేటాయించడం ఎంతవరకు సమంజసం అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిమ్మాపూర్ మండల మైనార్టీ ప్రజలు ఒక్కసారి ఆలోచించి “బీఆర్ఎస్ పార్టీ హటావో తెలంగాణకు బచావో “అనే నినాదంతో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. దళిత బడుగు బలహీన వర్గాలకు, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నా రు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *