Breaking News

యువకుడిపై మంత్రి కొడుకు తుపాకితో కాల్పులు..!

260 Views

*యువకుడిపై మంత్రి కొడుకు తుపాకితో కాల్పులు..!*

ల‌క్నో:సెప్టెంబర్

కేంద్ర మంత్రి ఇంటిలో జ‌రిగిన కాల్పుల‌లో ఒక యువ‌కుడు మ‌ర‌ణించాడు మంత్రి కుమారుడు వికాస్ లైసెన్స్ డ్ గ‌న్ తో అత‌డిని కాల్పి చంపారు..

తెల్లవారు జామున 4.15 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని బెగారియా గ్రామంలో మంత్రి ఇంట్లో ఈ ఘటన జరిగింది మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం వినయ్ శ్రీవాస్త‌వ్ ను పిలిచారు అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవ తలలో గన్ పెట్టి కాల్చి చంపారు.

మృతుడిని 30 ఏళ్ల వినయ్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. చనిపోయిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అంతేకాదు వినయ్ బీజేపీ కార్యకర్త కూడా.

అయితే చంపడానికి ఉపయోగించిన గన్ మంత్రి కుమారుడు అషు లైసెన్స్డ్ రివాల్వర్ గా తేల్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉన్నారు వెంటనే ఆయన పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గన్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

యువకుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లక్నో డీసీపీ వెస్ట్ రాహుల్ రాజ్ తెలిపారు. మరణించిన యువకుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల పై ఐపీసీ సెక్షన్ 302హత్య కింద కేసు నమోదు చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *