ప్రాంతీయం

ముగ్గురు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను అరెస్టు చేసిన రూరల్ సిఐ ఉపేందర్

129 Views

 

ముగ్గురు గంజాయి నిందుతులు అరెస్ట్.1కేజీ 470 గ్రాముల గంజాయి,గంజాయి ప్యాకింగ్ కోసం ఉపయోగించే కవర్లు స్వాధీనంతంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందుతులు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతులు వివరాలు.ఎం‌డి. అహ్మద్ @ అహ్మద్ పాష s/o రఫిక్,21y, r/o కుమ్మరిగల్లి సిరిసిల్ల మండలం,.గడధస్ శివ @శ్రీకాంత్ s/o భాస్కర్,23y,r/o శాంతినగర్, సిరిసిల్ల మండలము మరియు 3.తాళ్ళపల్లి ప్రణయ్ s/o రాజయ్య,25y, r/o అంబేడ్కర్ నగర్ సిరిసిల్ల ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూతేదీ 03-07-2023 రోజున తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామం శివారులో గల రామాలయం గుడి వద్ద గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించగా వారిని సుమారు ఉదయం 10 గంటల సమయంలో పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 01 కేజీ 470 గ్రాముల గంజాయి దొరకగా అట్టి వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు నాందేడ్ లోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి జిల్లా కి తీసుకువచ్చి అక్రమంగా అమ్ముతున్నామని తెలుపగా,ఇట్టి ముగ్గురు వ్యక్తుల మీద తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ కు కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించనైనది అని సి.ఐ ఉపేందర్ గారు తెలియజేశారు.ఇట్టి గంజాయి నిందితులను పట్టుకోవడం లో ప్రముఖ పాత్ర పోషించిన తగాలపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,కార్తీక్,తిరుపతి ,శ్రీనివాస్ లను సి.ఐ అభినందించారు..గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు..ఈ సమావేశంలో ఎస్.ఐ ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,కార్తీక్,తిరుపతి ,శ్రీనివాస్ పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *