వర్గల్ మండల స్థాయి 4,5తరగతులకు స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్.
తేదీ 5. 7 .2023 నాడు గజ్వేల్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ మహాత్మా జ్యోతిరావు పూలె పాఠశాల-వర్గల్ (పుల్ల రెడ్డి కళాశాల)నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని వర్గల్ మండల విద్యాధికారిని శ్రీమతి సునీత తెలిపారు. .ఈ సెలక్షన్స్ లో 4 తరగతి అడ్మిషన్ కొరకు పాల్గొనే విద్యార్థులు 3 తరగతి పాస్ అయి ఉండి తేదీ 01.09.2014 -31.08.2015 మధ్య జన్మించి ఉండాలని మరియు 5 వ తరగతి అడ్మిషన్ కొరకు పాల్గొనే విద్యార్థులు తేదీ 01.09.2013- 01 .08.2014 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. సెలక్షన్స్ లో పాల్గొనదలచిన వారు నిజ ధృవ పత్రాలు అనగా జన్మదిన ధ్రువ పత్రం, ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ తీసుకొని రావలసిందిగా తెలియజేశారు.మండల స్థాయిలో సెలక్షన్ అయిన విద్యార్థులు జులై 9 తేదీ నుండి15 తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగే సెలక్షన్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.వివరాలకు 9963732410 నంబర్ ను సంప్రదించమన్నరు.