24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
జూన్ 10 మర్కుక్
క్రీడలు మానసిక ఉల్లాసమే కాక శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయి
-ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు
క్రీడలు మానసిక ఉల్లాసమే కాకుండా శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయని మర్కుక్ మండల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు అన్నారు. ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉమ్మడి జగదేవపూర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు జెర్సీని అందించారు. లీగ్ లో మొదట తలపడిన ఎర్రవల్లి మరియు శివారు వెంకటాపూర్ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ గారు… మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ డైరెక్టర్ ఎస్పీ పరశురామ్ సీనియర్ క్రీడాకారులు ప్రభాకర్ శేఖర్ కర్ణాకర్ రాజు శ్రీకాంత్ నవీన్ గౌతమ్ క్రీడాకారులు ఉన్నారు.
