క్రీడలు

ముగిసిన ఎర్రవల్లి ,గజ్వేల్ మధ్య ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్

64 Views

ముగిసిన ఎర్రవల్లి ,గజ్వేల్ మధ్య ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం
ఎర్రవల్లి గ్రామంలో గత 25 రోజులుగా ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి & గజ్వేల్ మధ్య ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. ఈ మ్యాచ్ లో
గజ్వేల్ జట్టు విజేతగా , ఎర్రవల్లి జట్టు రన్నరప్ గా నిలిచాయి.

విజేతలకు మొదటి బహుమతి 11 వేల రూపాయలు ఇటిక్యాల నరసోల్ల రాజలింగం చేతుల మీదుగా అందజేశారు.

రెండవ బహుమతి 5,500/- రూపాయలు పాములపర్తి బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు కరుణాకర్ అందజేశారు.
ఇరుజట్లకు బహుమతులను డిజే శివ ఆర్థిక సహకారంతో అందజేశారు.
ఈ టోర్నమెంట్ సందర్భంగా అన్నదాన కార్యక్రమనికి సహకరించిన కుంట స్వామి కి ఇరు జట్ల సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగదేవపూర్ మండల పాక్స్ వైస్ చైర్మన్ కమ్మరి బాలరాజు, మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ, గజ్వేల్ సీనియర్ ప్లేయర్ కాజా భాయ్, అశోక్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్