ముస్తాబాద్, ప్రతినిధి జూలై 2, మండలంలో భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిపై గుర్రుగా ఉన్న మండల నాయకులు గత కొన్ని నెలల నుండి మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డిపై బిజెపి నాయకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అతను పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ నాయకత్వ లోపాలను పట్టించుకోకుండా తన స్వార్ధ ప్రయోజనాలకు పార్టీని ఉపయోగించుకుంటున్నాడని అతని ఆధ్వర్యంలో పనిచేయడం కుదరదని మండల నాయకులు చాలాసార్లు జిల్లా అధ్యక్షుడికి, జిల్లా సీనియర్ నాయకులకి విన్నవించిన అతనిపై చర్యలు తీసుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఈ సమస్యను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలకు దారితీస్తున్నాయని అన్నారు.భవిష్యత్తులో ఇలాగే ఉంటే మండలపార్టీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేసి కార్యకర్తలుగా పార్టీ కోసం కృషి చేస్తామని మండల నాయకులు భాహటంగా చెప్పడం జరిగింది..
