ప్రాంతీయం

తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు…

188 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, తెలంగాణ గురించి అలుపెరగని పాటలు పాడిన యువనాయకుడిగా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంనుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం పరుస్తూ పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చిన గిడ్డంగుల సాయిచంద్ తెలంగాణ గాయకుడు బహుజన యుద్ధనౌక అంబేద్కర్ వాది గాయకుడు మంచి మనసున్న సాయిచంద్ మరణించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్, చికోడు గ్రామశాఖ అధ్యక్షులు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *