ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, మండలంలో బిజెపి ముసలం.. అర్హత లేనివారకు పదవులు అంటగట్టి సంవత్సరాల పాటు ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఇకపై మండలంలో పదవి అంటగట్టిన ఆనాయకుడు పిలిస్తే ఇకనుండి స్పందించమని అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలే ఎలక్షన్ సమస్యల్లో ఉత్కంఠ మొదలైతే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీదకారం చల్లినట్టు ఉంటోంది. ఉన్నవాళ్లు బయటకు రావడానికైనా ఇతరపార్టీ వాళ్లు బీజేపీలోకి వెళ్లకపోవడానికైనా చెప్పే ఒకేఒకకారణం కోవర్టుగా మనుషులు బీజేపీలో ఉన్నారని అక్కడ జరిగే పరిణామాలు, చేరికలు, ఇతర సమాచారాన్ని మనఉప్పు అందిస్తున్నారు. ఇప్పుడు గట్టిగా కోవర్టులున్నారని తేల్చి చెప్పడానికి పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లోని కీలక విషయాలు నేరుగా ఇతర పార్టీలకు చేరవేస్తున్నారంటూ ఆరోపనలు వినిపిస్తున్నాయి. పలువిధాలుగా సూచనలు ఇచ్చిన పెడచెవిన పెట్టి చలాగిస్తున్నట్టు ఉంటున్నారని పలువురు నేతలు తెలిపారు. పార్టీలో నమ్మిన బంటులుగా ఉంటూ బిజేపికి చేటు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై బిజేపి పార్టీలో తీవ్ర అసంతృగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సంతృప్తి చేయడంలో జిల్లా అధ్యక్షులు కనువిప్పు చేయాలని కొందరు బిజెపి నాయకులు కోరారు.




