ప్రాంతీయం

ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష

50 Views

ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఆయిల్ ఫామ్ సాగులో ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకొడిగా ఉన్నందున అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్రాప్ బుకింగ్, రిజిస్ట్రీ, పండ్ల తోటలు పెంపకం పనులు ఉంటాయి. ఆయిల్ ఫ్రైడ్ అధికారులు ఆయిల్ ఫామ్ సాగు మాత్రమే పని అని మీకు వారందరికంటే మెరుగ్గా పనిచేయాలని ఆదేశించారు. మండలాల్లో ఆయిల్ ఫ్రైడ్ అధికారులు చురుకుగా పనిచేయాలని మీకు వ్యక్తిగతంగా కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు.ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ప్రోత్సహించాలని రైతులను గుర్తించగానే డిడి తీసుకుని వెంటనే చదును చేయించి ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సువర్ణ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *