ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27 చికోడు గ్రామంలో అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. నివాస ముంటున్న చెత్తకుండీలు ఎక్కడ కానీ కన్పించవు. దీనికి తోడు డ్రెయినేజీ వ్యవస్థ మురుగనీటి కాలువలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి దోమలకు నిలయాలుగా మారాయి. ఫలితంగా ప్రజలు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో స్వచ్ఛభారత్ మొదటిగా చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రతి పల్లెనూ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచి రోగాలులేని సుభిక్ష రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆశయాలకు అధికారులు తుంగలో తొక్కిస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన వ్యర్థాలను, చెత్తను తరలించడానికి కోట్ల రూపాయలను వెచ్చించి వాహనాలను సైతం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికీ చెత్త సేకరణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వం ఇన్ని వసతులు కల్పించినప్పటికీ అటు అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామ ప్రజలను సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయని. మురుగునీటి కాలువలను నెలలు గడుస్తున్న శుభ్రం చేయకపోవడంతో కాలువల్లో చెత్తా, చెదారం పేరుకుపోయి ఎక్కడి నీరు అక్కడ స్తంభించింది కంపు కొడుతూ దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమల బెడద అధికమై సీజనల్ వ్యాధుల బారిన పడడమే విషజ్వరాలు ప్రబలితే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడం, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం దారుణమని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకుని చెత్తకుండీలను ఏర్పాటు చేసి, డ్రెయినేజీలు శుభ్రం చేసి సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య చర్యలు చేపట్టాలని మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజలు కోరుతున్నారు.
