ప్రాంతీయం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

42 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*రామగుండము కమిషనరేట్ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అడిషనల్ డీసీపీ *

*రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డిసిపి *

రామగుండము కమిషనరేట్ కార్యాలయం నందు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని పతాకానికి అందిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా *అడిషనల్ డీసీపీ అడ్మిన్  మాట్లాడుతూ..* రామగుండము కమీషనరేట్ ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మరియు భారతదేశ మంతటా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని బారత దేశపు ప్రజలకు ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాతంత్ర్య సిద్ధించిందని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత సుపరిపాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, సర్వస్వం అర్పించి మనకు స్వేచ్ఛను కల్పించిన త్యాగధనులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ దేశానికి అంకితం కావడంలోనే ప్రతి మనిషికి సార్థకత లభిస్తుందని అన్నారు. పోలీసు అధికారులుగా మనమంతా జాతి సమగ్రతకై, శాంతి సమాజ స్థాపనకై తద్వారా ప్రజల అభివృద్ధికి బాటలు వేసేందుకు దృఢనిశ్చయంతో పని చేయాలని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడిపే విధంగా చూస్తాం అన్నారు.

ఈ కార్యక్రమం లో గోదావరి ఖని ఏసీపీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు , టాస్క్ ఫోర్స్ ఏ సి పి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, సీఐ లు, ఎస్ఐ లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, శ్రీనివాస్, సూపరింటెండెంట్ మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, వివిధ వింగ్స్ , సిపిఓ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్