Breaking News ప్రకటనలు రాజకీయం

ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి….సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు

123 Views

ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి*
సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు-
ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్:
ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని విపరీతమైన ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అనుమతి లేని హాస్పిటలతోపాటు ఫార్మసిస్టులేని మెడికల్ల పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలోని డాక్టర్లు చివరకు ఆర్ఎంపి పీఎంపీలు కూడా ఫార్మసిస్టు లేకుండానే మెడికల్ నిర్వహణ కొనసాగిస్తున్నారని అదే క్రమంలో ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేసుకొని అవసరం ఉన్నా లేకున్నా రోగుల నుండి అనవసరంగా టెస్టులు చేస్తూ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని డయాగ్నస్టిక్ సెంటర్ యజమానులతో కుమ్మక్కైన డాక్టర్లు అవసరం లేకుండా అనేక రకాల టెస్టుల పేరుతో డయాగ్నస్టిక్ సెంటర్ యజమానులతో కమిషన్లు పొందుతున్నారని మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకొని ఫార్మసిస్టు లేకుండానే మెడికల్ నడిపిన డ్రగ్ ఇన్స్పెక్టర్ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని దీనికి కారణం వారికి నెలనెలా మామూలు ముట్టడివేనని మెడికల్ షాప్ లో యజమానులు ప్రిస్కిప్షన్స్ ప్రకారం మందులు ఇవ్వకుండా తక్కువ ధరకు దొరకే జనరిక్ మందులు ఇస్తూ అధిక లాభాలు పొందుతూ విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఇప్పటికైనా ఈ విషయాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఆర్థిక దోపిడీ చేస్తున్న ప్రైవేటు మెడికల్ యజమానులపై అదే క్రమంలో అనుమతులేని ప్రైవేట్ హాస్పటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు పంతం రవి, అజ్జ వేణు, నాగరాజు, రాజేందర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *