మంచిర్యాల జిల్లా ,దండేపల్లి మండలం, కాసిపేట గ్రామం.
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం. ..
దండేపల్లి మండలం , కాసిపేట గ్రామంలో ఇటీవల మరణించిన కోట్నాక హనుమంతు కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు అప్పల సునీల్, బక్కశెట్టి వెంకటేష్, కళ్లెం రాజన్న, లక్కాకుల వెంకటేష్ మరియు మాదాసు వెంకటేష్ లు అందించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ కళ్లెం రాజన్న మాట్లాడుతూ భవిష్యత్తులో బాధిత కుటుంబాన్ని తోచిన విధంగా ఆదుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారెడ్డి మరియు శంకర్ పాల్గొన్నారు.
