రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు
సరిపడినన్ని యూరియా బస్తాలు
అల్వాల గ్రామంలోని రైతు వేదికలో యూరియా కార్డుల పంపిణీ
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,(తెలుగు న్యూస్ 24/7 )
రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని జిల్లాలో సరిపడినన్ని యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు సూచించారు.మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని రైతు వేదికలో యూరియా కార్డుల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
రైతులకు యాసంగి సీజన్ లో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా పగడ్బందిగా ప్రణాళిక ప్రకారం అన్ని సెంటర్ లలో యూరియా బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. మీ ప్రాంతాల్లోని వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని మీ యొక్క పాసు బుక్ తీసుకుని వచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చెయ్యాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. కౌలు రైతులు సైతం అధైర్య పడవద్దని మీరు చేస్తున వ్యవసాయ క్షేత్ర పట్టేదర్ పాస్ బుక్ లేదా జిరాక్స్ తీసుకువస్తే యూరియా అందిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న యూరియా కొరత కథనాలను నమ్మవద్దని ప్రతి రైతుకు యూరియా అందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ వ్యవసాయ శాఖ ఏఓ, ఏఈఓ తదితరులు ఉన్నారు.





