ప్రాంతీయం

విద్యా సంస్థలు పై చర్యలు తీసుకోవాలి 

82 Views
  • ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాల అమ్ముతున్న విద్యా సంస్థలు పై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి

సిద్దిపేట జిల్లా జూన్ 13

సిద్దిపేట జిల్లా చేర్యాల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కమిటీ సమావేశంలో ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల పట్టణంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలో పుస్తకాలు,యూనిఫామ్ లను బైరుగతంగా అమ్ముతున్నారని వారు తెలియజేశారు వాటిలో శ్రీ చైతన్య,ఓకే ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ గ్రామర్ స్కూల్,ప్రజెంటేషన్,కృష్ణవేణి,గాయత్రి మండలంలో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి పుస్తకాల అమ్ముతున్న స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ముందు పుస్తకాల ఫీజు కట్టించుకొని తర్వాత విద్యాసంస్థలు పిల్లలకు పుస్తకాలు ఇస్తున్నారని వారు తెలియజేశారు పుస్తకాల పేరు మీద వ్యాపారం చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులతో పై రక్తం తాగుతూ పుస్తకాలు స్కూల్లోనే కొనాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే వేరే పుస్తకాలను తెచ్చుకున్న అనుమతి ఇస్తలేరని విద్యార్థులు తల్లిదండ్రులతో ఆవేదన చెందుతున్నారు ప్రైవేట్ విద్య సంస్థలు ఫీజులను కూడా అరికట్టాలని విచ్చలవిడిగా పైసలు వసూలు చేస్తున్నారని అడ్మిషన్స్ పేరుతో శ్రీ చైతన్య మరియు ఓట్లు ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ ఫీజు 2500 తీసుకుంటున్నారని  అన్నారు తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల సోదాలు చేయాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ అధికారి తనిఖీలు చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ప్రైవేట్ విద్య సంస్థలు మేమే తనిఖీలు చేసే పుస్తకాలు అమ్ముతున్న బయటికి తీస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తాడూరి భరత్ కుమార్,తుమ్మ నరేష్,శివ,అనిల్ వసంత్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్