ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి

30 Views

మంచిర్యాల జిల్లా.

రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన  సర్వే ను వెంటనే చేపట్టాలి.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో 42% బీసీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలి.
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ పిలుపు.
ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నందు బిసి జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కుల జనగణలో జరిగిన లోపాలను ఎత్తి చూపెడుతూ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఈ రాష్ట్రంలో కుల జన గణనను చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన కుల జనగణనను బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా స్వాగతిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ ఈ సర్వేలో అనేక రకమైన లోపాలు ఉండడం బీసీ ప్రజానీకానికి చాలా బాధాకరమైన విషయం, బీసీల జనాభాను తక్కువ చూపెట్టడం అంటేనే బీసీ ప్రజలను మోసం చేయడము అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మరియు ఈ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులో ఉన్న బీసీ ప్రజల రిపోర్ట్ ప్రకారం ఏమాత్రం ఈ సర్వే రిపోర్ట్ సరితూగడం లేదు. ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలు గత పది సంవత్సరాల క్రితం చేసిన సకలజనుల సర్వేల రిపోర్ట్ ప్రకారం 8 శాతం ఉంటే ఈ రిపోర్టులో 15%గా చూపెట్టడం అనేది బీసీ ప్రజలను మోసగించడమే అవుతుంది మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం అగ్రవర్ణాల ను ఎక్కువగా చూపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రి సర్వే పేరిట ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనని ప్రజలను పాల్గొనడం పాల్గొనడం కోసం ఈనెల 16 నుండి 28 వరకు అవకాశం కలిపించడo మళ్లీ అందులో 3.6% ప్రజలను లెక్కించడం అంటేనే బీసీ ప్రజలను మోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలను 8 శాతం ఉంటే 15% ఉండడం అనేది అగ్రవర్ణాలు తమకు తాము చట్టబద్ధత కల్పించుకోవడమే అవుతుంది. ఈ డబుల్ ఎస్ పేట 10% రిజర్వేషన్ కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మీనా వేషాలు లెక్కపెడుతుంది అసలు ఈ సర్వే రిపోర్ట్ లో ఎంబీసీ కులాలకు చెందిన ప్రజలను లెక్కించకపోవడం అంటేనే మొత్తం బీసీ ప్రజలను మోసం చేయడమే జరుగుతుంది. కావున ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రిపోర్ట్ పైన నిపుణుల కమిటీ వేసి రీ సర్వే చేయించి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి చెప్పాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. BRS, బీజేపీ పార్టీల నాయకులు మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అవసరమైతే రాహుల్ గాంధీ గారు ఈ సర్వే లో జోక్యం చేసుకొని బీసీ ప్రజలకు న్యాయం చేయాలని కోరడమైనది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీ ప్రజలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశంలో 42 శాతం అవకాశం కల్పిస్తూ చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, తులా మధుసూదన్ రావు, బీసీజేఏసీ చెన్నూరు ఇన్చార్జి ఆవిడపు గణేష్, జిల్లా ప్రచార కార్యదర్శి డేగ నరేష్, జైపూర్ మండల గౌరవ అధ్యక్షులు ఇజ్జగిరి సమ్మయ్య, జైపూర్ మండల అధ్యక్షులు వేముల మల్లేష్, నస్పూర్ బీసీజేఏసీ నాయకులు గరిగ చేరాలు, దేవసాని నాగరాజు, బీసీ జేఏసీ జిల్లా నాయకులు లింగన్నపేట విజయ్ కుమార్ గాజుల ప్రభాకర్ రావు, కొయ్యడా వెంకటేశ్వర గౌడ్, బీసీ జేఏసీ యువజన నాయకులు ఎండి లతీఫ్, జంగంపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్